Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 1, 2026Short Read
మోదీని విమర్శిస్తే నాపై మాట పడ్డట్టే.. భోగాపురంలో పవన్ కళ్యాణ్ ఉద్వేగం!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని కొందరు జంతర్ మంతర్ లో విమర్శించడం చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
భోగాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
మోదీ గారి పడిన కష్టం ఇప్పటి తరానికి పూర్తిగా తెలియకపోవచ్చని అన్నారు.
ఆయనపై ఒక్క మాట పడినా అది తమపై పడ్డట్టేనని పవన్ స్పష్టం చేశారు.
విమర్శించిన వారిని కూడా క్షమించిన మోదీ గారి గొప్ప మనసుకు నమస్కరిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.





